- Advertisement -
ఆజాంగఢ్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజాంగఢ్ జిల్లాలో బిఎస్‌పి నేత కలాముద్దీన్‌ఖాన్(60)ను ఆయన ప్రత్యర్థులు కాల్చి చంపారు. మేహ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. హంతకులు మోటార్ సైకిళ్లపై వచ్చి కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. బిఎస్‌పి తరఫున ఖాన్ రెండుసార్లు ఎంఎల్‌ఎగా పోటీ చేశారు. ఖాన్‌కు నేర చరిత్ర ఉన్నదని ఎస్‌పి సుధీర్‌కుమార్‌సింగ్ తెలిపారు. ఖాన్‌పై ఆరు కేసులుండగా, అందులో రెండు హత్యా నేరానికి సంబంధించినవని ఆయన తెలిపారు. ఖాన్ హత్యకు సంబంధించి ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్‌పి తెలిపారు. ముగ్గురిని అరెస్ట్ చేశామని, మిగతావారి కోసం 4 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని ఆయన తెలిపారు.
- Advertisement -