Sunday, January 19, 2025

సూర్యాపేటలో బిఎస్పి కి షాక్..

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:  సూర్యాపేటలో బిఎస్పి చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు చేదు అనుభవం ఎదురయింది. సూర్యాపేటలో ఆయన పర్యటిస్తున్న వేళ వట్టే జానయ్య యాదవ్ చేరికను వ్యతిరేకిస్తూ మొదటి నుంచి బిఎస్పి లో ఉన్న పార్టీ నేతలు కార్యకర్తలు బిఎస్పి కి రాజీనామా చేశారు. ఇప్పటికే పలువురు బిఎస్పి వీడగా, తాజాగా గాంధీనగర్ కు చెందిన మరికొంత మంది బీఎస్పీ నేతలు, కార్యకర్తలు సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

చేరిన వారికి గులాబీ కండువాతో సాదర స్వాగతం పలికారు మంత్రి జగదీశ్ రెడ్డి చేరిన వారిలో మాజీ నియోజక వర్గ అధ్యక్షుడు , ప్రస్తుత ఈసీ మేంబర్ యాతాకుల సునీల్, జిల్లా ఉపాధ్యక్షులు వీరస్వామి బోల్లికొండ, సూర్యాపేట మండల కన్వీనర్ బాలెంల ఉప్పలయ్య, మహిళా కన్వీనర్ శ్రావణపల్లి లలిత, ట్రెజరర్ సాయి గణేష్, ఇరుగు నవీన్, ఇరుగు నాగయ్య, లతో పాటు మరో 50 మంది బి ఎస్ పి కి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News