Friday, January 3, 2025

ప్రతి మండలంలో ఇంటర్‌నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం: ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఎస్‌పి ఎన్నికల మ్యానిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కాన్షీ యువ సర్కారు పేరిట యువతకు ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పది లక్షల ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రతి మండలంలో ఇంటర్‌నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని, ప్రతి మండలం నుంచి ఏటా వంద మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందిస్తామని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని, ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ కల్పిస్తామని, ఏటా రూ.25 వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్‌కు కేటాయిస్తామని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. భీం రక్షా కేంద్రాలు కింద వృద్ధులకు వసతి, ఆహారం, వైద్యం అందిస్తామన్నారు.

Also Read: గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత… రేవంత్ అరెస్టు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News