Sunday, December 22, 2024

నా హత్య కోసం కథనం సృష్టి : ఎంపీ డానిష్ అలీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభలో బీజేపీ ఎంపి రమేశ్ బిధూరీ సాటి బిఎస్‌పి ఎంపీడానిష్ అలీపై మతాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్‌పి ఎంపీ డానిష్ అలీ మరో బీజేపీ ఎంపి నిషికాంత్ దూబేపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కులవివాదం రెచ్చగొట్టేలా ఎంపీ డానిష్ అలీ తీవ్ర వ్యాఖ్యలు చేయడమే ఎంపి బిధూరీ ఆయనపై ఆగ్రహంతో ఆ విధంగా వ్యాఖ్యలు చేశారని దూబే సమర్థించారు. డానిష్ అలీ అసభ్యకరమైన వ్యాఖ్యలను పరిశీలించాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాశారు. దీనిపై ఎంపీ డానిష్ తీవ్ర ఆగ్రహంతో ఎంపీ దూబేపై విరుచుకుపడ్డారు. సభలో మాటలతో హత్య చేశారని, బయటకూడా భౌతికంగా హత్య చేయడానికి కథనం సృష్టిస్తున్నారని ఎంపీ నిషికాంత్ దూబేపై విరుచుకుపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News