Tuesday, January 21, 2025

యుపిలో బిఎస్‌పి ఎంపి రాజీనామా

- Advertisement -
- Advertisement -

లక్నో: బిఎస్‌పి ఎంపి రితేష్ పాండే పార్టీకి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అంబేడ్కర్ నగర్ ఎంపిగా ఉన్న పాండే బిఎస్‌పిని వీడి దేశ రాజధానిలో ఆదివారం బిజెపిలో చేరారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ పరిణామం జరిగింది. తన సేవలు పార్టీకి అవసరం లేదని తనకు అన్పిస్తోందని, తనను చాలా కాలంగా పార్టీ సమావేశాలకు పిలవడం లేదని, పైగా పార్టీ నాయకత్వం తనతో కనీసం మాట్లాడలేదని విమర్శించారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ అధ్యక్షురాలు మాయావతికి పంపించిన రాజీనామా లేఖలో తెలిపారు. రితేష్ నిర్ణయం పట్ల యుపి బిజెపి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆయనను తమ పార్టీకి స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News