- Advertisement -
లక్నో: ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) అమలుకు తమ పార్టీ బిఎస్‌పి వ్యతిరేకం కాదని, అయితే దేశంలో అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న తీరును బీఎస్‌పి వ్యతిరేకిస్తుందని బీఎస్‌పి అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ప్రజలందరి ఏకాభిప్రాయంతో అవగాహన కల్పించడంతో దీన్ని అమలు చేయాలే తప్ప రాజకీయం చేసి బలవంతంగా రుద్ద కూడదని పేర్కొన్నారు. ఏదెలాగైనా, అవగాహన కల్పన . ఏకాభిప్రాయ సేకరణ జరగడం లేదని, సంకుచిత రాజకీయాలతో యుసిసిని అమలు చేయాలనుకోవడం దేశ ప్రజలకు ఎవరికీ ఆసక్తి కలిగించబోదని వ్యాఖ్యానించారు. ఈ విషయమై ప్రజాభిప్రాయాన్ని, మేథావుల అభిప్రాయాన్ని లా కమిషన్ ఇటీవల కాంక్షించడంతో తిరిగి ఇది ప్రజల్లో చర్చకు అవకాశం ఇస్తోందన్నారు
- Advertisement -