Monday, December 23, 2024

‘ప్రవీణ్ ఐపిఎస్’ సినిమాను వీక్షించనున్న ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,మాజీ ఐపిఎస్ అధికారి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన బయోపిక్ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జీవితం ఇతివృత్తంగా ఆయన చిన్నతనంలో ఎదుర్కొన్న పేదరికం, కుల వివక్ష, చదువు కోసం పడ్డ కష్టాలు, సమాజం మార్పు కోసం విద్యార్థిగా,ఉద్యోగిగా చేసిన కృషిని వెండి తెరకెక్కించారు.

దేశంలోనే అత్యున్నత ఐపిఎస్ ఉద్యోగానికి ఎంపికై ఐపీఎస్ అధికారిగా తాను సాధించిన విజయాలతోపాటు, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకహార్వర్డ్ యూనివర్శిటీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన విధానం. ఎస్సీ,ఎస్టీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా లక్షలాది మంది పేద విద్యార్థుల జీవితాలను మార్చిన సంఘటలను తెరకెక్కించారు. ఏడేళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే, అత్యున్నత ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, డా.బి.ఆర్.అంబేడ్కర్, కాన్షీరాం ఆశయాల సాధన కోసం రాజకీయ ఆరంగ్రేటం చేసి కోట్లాది మంది తెలుగు హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న విధానం సినిమాలో చూడవచ్చు. ఇందుకోసం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లుచేశారు. ఆయనతో కలిసి సినిమా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు సిద్ధమవుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News