Monday, December 23, 2024

43 మందితో బిఎస్పీ రెండో జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

వరంగల్ ఈస్ట్ నుంచి ట్రాన్స్‌జెండర్ పుష్పిత లయకు అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల రెండో జాబితాను బహుజన సమాజ్ పార్టీ విడుదల చేసింది. 43 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. సోమవారం లక్డీకపూల్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెండో జాబితాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థులను ప్రకటించగా రెండో జాబితాలో 43 మందిని ప్రకటన చేశారు. దీంతో ఇప్పటి వరకు బీఎస్పీ 63 మంది అభ్యర్థులను ప్రకటించగా మరో 56 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. కాగా రెండో జాబితాతో వరంగల్ ఈస్ట్ నుంచి పుష్పిత లయ అనే ట్రాన్స్ జెండర్ పేరును ఖరారు చేశారు. దీంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలవనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News