Saturday, November 23, 2024

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బిస్పి పోటీ : మాయావతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 2024 లోక్‌సభ , రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. పాలక వర్గ ఎన్‌డిఎ తోకానీ, కొత్తగా విపక్షాలతో ఏర్పడిన కూటమి ఇండియాతో కానీ తమ పార్టీ పొత్తులు పెట్టుకోదని చెప్పారు. పంజాబ్, హర్యానాల్లో ప్రాంతీయపార్టీలతో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని చెప్పారు. ఎన్‌డిఎ, విపక్షకూటమి ఇండియా వీటిలో ఏవీ దళితులకు, అణగారిన వర్గాలకు అనుకూలమైనవి కావని ఆరోపించారు.

ఆ రెండూ తమకు తాము పటిష్టపర్చుకుంటున్నాయని, తాము కూడా దేశం మొత్తం మీద పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ కులతత్వ భావజాలంతో దళితుల, అణగారిన వర్గాల డిమాండ్లను విస్మరించినందున అణగారిన వర్గాలు బీఎస్‌పీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ కులతత్వాన్ని పెట్టుబడిదారీ భావజాలాన్ని పక్కన పెట్టి పేదల, బడుగు వర్గాల సంక్షేమం కోసం పాటుపడి ఉంటే బీఎస్‌పి అవతరించే అవసరమే ఉండేది కాదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News