Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తి లేదు: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనున్నట్లు వస్తున్న వార్తలను బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్‌పి) తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కొట్టివేశారు.

తెలంగాణకు చెందిన కాంగ్రెస పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో తాను పొత్తులపై చర్చించినట్లు కొన్ని పత్రికలలో నేడు వార్తలు వచ్చాయని, ఇవన్నీ తప్పుడు వార్తలని బుధవారం ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల గురించి తాము కాంగ్రెస్ నాయకులు ఎవరితోనూ చర్చించలేదని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని ఆయన తెలిపారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఆయన ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News