బాలాపూర్: అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా భారతదేశానికి ఉన్నత విద్యావంతులైన ఉత్తమ పౌరులను అందించేందుకు బిఎస్‌పి పార్టీ కృషి చేస్తుందని ఆపార్టీ మహేశ్వరం మహిళ విభాగం కన్వీనర్ ఇందుమతి పేర్కొన్నారు. బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్‌గుల్ గ్రామంలో గల ప్యారం విజయభారతివిద్యాసాగర్ ఛారిటబుల్ ట్రస్టులోని అనాధ విద్యార్ధులకు ఇందుమతి శనివారం నోటు పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న బహుజన రాజ్యంలో బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ము ఖ్యమంత్రి అయితే సమాజంలో అట్టడుగు వర్గాల వద్దకే విద్యా,వైద్య రంగాలను తీసుకురావడం జరుగుతుందని అన్నారు. సమాజంలో వెళ్లూనుకున్న అంటరానితనం,అస్పృశ్యతల తొలగింపు కేవలం విద్యతోనే సాధ్యమన్న అంబేద్కర్ సిద్ధాంతం మేరకు ప్రతిఒక్కరు చదువుకోవాలన్న సంకల్పంతోనే తాను అనాధ విద్యార్ధులకు నోటుపుస్తకాలను అందజేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో నరేందర్, యామిని, అరవింద్, రోహిత్ పాల్గొన్నారు.