Sunday, February 2, 2025

బీటీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన :మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ :  ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఈశ్వరమధారం గ్రామంలో రూ.15కోట్లతో భగత్ వీడు-మద్దివారి గూడెం రోడ్డు, హై లెవెల్ వంతెన, రాజుపేట-పెరికసింగారం రోడ్డు విస్తరణ అభివృధ్ధి పనులకు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పాలేరు నియోజకవర్గం రామన్నపేట వద్ద రూ.33కోట్లతో చేపట్టనున్న దానవాయిగూడెం నుండి పాపటపల్లి ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు కూడా మంత్రులు శంకుస్థాపన చేశారు. వారి వెంట ఎమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వర రావు , వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News