Monday, January 20, 2025

ప్రతి గ్రామానికి బిటి రోడ్డే లక్షం

- Advertisement -
- Advertisement -
  • కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్

ఆమనగల్లు : ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడమే లక్షంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

మాడ్గుల మండలంలోని పడమటి తండా, చెట్లగుట్ట తండా, కూభ్యతండా, మక్తా తండా, జర్పుల తండాలలో ఆదివారం స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి బీటీ రోడ్ల నిర్మాణం పనులకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ భూమిపూజ చేశారు. నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లు బీటీ రోడ్లుగా మారుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే బీటీ రోడ్లు నిర్మాణం కోసం రూ.111 కోట్లు మంజూరయ్యాయని, పనులు జరుగుతున్నాయని జైపాల్‌యాదవ్ తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే అన్ని గ్రామాల ప్రజలకు రవాణా మార్గం సులువవుతుందని తెలిపారు.

కార్యక్రమంలో వైస్‌ఎంపిపి శంకర్‌నాయక్, సర్పంచులు వస్రమ్‌నాయక్, లక్ష్మీ, హీరాదేవి, ఎంపిటిసిలు సరిత బ్రహ్మం, గ్యార వెంకటయ్య, మండల పార్టీ అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపిపి జైపాల్ నాయక్, మాజీ జెడ్పిటిసి పగడాల రవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News