Friday, January 10, 2025

డ్రగ్స్ విక్రయిస్తున్న బిటెక్ విద్యార్థి అరెస్టు

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ విక్రయిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది సోమవారం అరెస్టు చేశారు. అతడి వద్ద ఏడు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…ఎపిలోని నెల్లూరు జిల్లాకు చెందిన కట్టమంచి జాన్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. స్కిల్స్ నేర్చుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చి జెఎన్‌టియూలో చేరాడు. ఈ క్రమంలోనే జాన్ గంజాయి, డ్రగ్స్‌కు బానిసగా మారాడు. వీటిని కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో డ్రగ్స్, గంజాయి విక్రయించడం ప్రారంభించాడు.

వసస్థలిపురం ఎస్‌వీఆర్ గార్డెన్, క్రాంతి హీల్స్‌కాలనీ సుష్మా ధియేటర్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. సుష్మా థియేటర్ సమీపంలో అనుమానంగా తిరుగుతున్న జాన్‌ను పట్టుకుని తనిఖీ చేయగా డ్రగ్స్ లభించాయి. ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. జాన్ రూ.2,500 గ్రాము ఎండిఎంఎను తీసుకువచ్చి రూ.5,000 విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ నంద్యాల అంజి రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News