- Advertisement -
హైదరాబాద్: డ్రగ్స్ అమ్ముతుండగా బీటెక్ విద్యార్థిని పోలీసులు పట్టుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో జరిగింది. జాన్ అనే యువకుడు ఇటీవలే నెల్లూరులో బిటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ కోచింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. సుష్మ థియేటర్ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టగా డ్రగ్స్ తో జాన్ పట్టుబడ్డాడు. డ్రగ్స్ విక్రయిస్తూ అనుమానాస్పదంగా తిరుగుతున్న జాన్ నుంచి 7 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒక గ్రాము రూ. 2500కు తీసుకొచ్చి రూ. 5000 చొప్పున అమ్మకాలు చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది.
- Advertisement -