Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

జఫర్‌గడ్ : మండల కేంద్రానికి చెందిన వ్యాపారి బజ్జూరి సంతోష్ కుమారుడు బజ్జూరి జనక దత్త (18) అనే విద్యార్ధి శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందాడు. జనక దత్త శనివారం సాయంత్రం వ్యక్తి గత అవసరాల నిమిత్తం మండల కేంద్రం నుంచి వేరే గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే పెద్దమ్మ గుడి ప్రాంతంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ నిలిపి ఉంది. ట్రాక్టర్ పక్క నుంచి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ట్రాక్టర్ ను ఢీకొట్టాడు. దీంతో అతనికి తలకు బలమైన గాయాలయ్యాయి.

తీవ్రపు రక్తపు మడుగులో ఉన్న అతన్ని స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా అక్కడి చేరుకుని హుటాహుటిన వరంగల్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. జనక దత్త బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కాగా మృతుని తల్లిదండ్రులు కుమారుని మృతిపట్ల కన్నీరు మున్నీరుగా విలపించారు. పలువురు ఇరుగు పొరుగు వారు కంటతడి పెట్టుకున్నారు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News