Monday, January 20, 2025

జమ్మిగడ్డలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : బీటెక్‌లో 10 బ్యాక్‌లాగ్‌లు ఉండటంతో మనస్థాపం చెంది ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డలో చోటు చేసుకుంది.సబ్ ఇన్‌స్పెక్టర్ సాయిలు తెలిపిన వివరాల ప్రకారం కాప్రా మండలం జమ్మిగడ్డ పరిధిలోని మారుతినగర్‌లో నివసించే కైపా శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు కైపా సాయి ప్రణీత్‌రెడ్డి(22)బీటెక్ చదువుతున్నాడు.శుక్రవారం తండ్రి శ్రీనివాస్‌రెడ్డి డ్యూటీకి వెళ్లగా తల్లి బందువుల పెళ్లికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రణీత్‌రెడ్డి టవల్‌తో ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు.

మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తండ్రి జరిగిన సంఘటనను చూసి తలుపులు పగులగొట్టి కుమారుడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు.బీటెక్‌లో 10 బ్యాక్‌లాగ్‌లు ఉండటంతోనే తన కుమారుడు సాయి ప్రణీత్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ సాయిలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News