జిల్లా కేంద్రములో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఫిర్యాదుదారుడైన క్షీరసాగర్ సత్యనారాయణ తండ్రి నారాయణ వికారాబాద్ మునిసిపల్‌లో గాంధీ కాలనీలో అద్దెకి వుంటూ మృతురాలి విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. వారిది సొంత గ్రామం ముజాహిద్ పూర్, కుల్కచర్ల మండలం వారి బంధువైన నందకుమార్ కూతురు పెళ్లి ఉన్నందున బుధవారం తన కుటుంబీకుందరు కలిసి ముజఫర్ గ్రామం వెళీళ్లారు. నా కూతురు క్షీరసాగర జ్యోతి గురువారం తన బీటెక్ ఫైనల్ ఇయర్ కు సంబంధించి ఆన్లైన్ పరీక్ష ఉందని ముజఫర్
నుంచి వికారాబాద్ లోని గాంధీ కాలనీలో తమ ఇంటికి వచ్చి ఒక్కతే రూమ్‌లోఉ న్నది.శుక్రవారం ఉదయం కుటుంబీకులందరూ పెళ్లికి కావాల్సిన మొత్తం బట్టలు తీసుకుని వెళ్దామని రూమ్ దగ్గరికి వచ్చి చూడగా రూమ్ లోపల నుంచి డోర్ పెట్టి ఉన్నది కూతురు జ్యోతిని ఎన్నిసార్లు పిలిచినా డోర్ తీయలేదు ఏం జరిగిందని చుట్టుపక్కల ఉన్న వారి సహాయంతో 9 గంటల సమయంలో డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ప్లాస్టిక్ నైలాన్ తాడుతో సీలింగ్ ఫ్యాన్ కోసం ఏర్పాటుచేసిన కొండకి ఉరివేసుకొని చనిపోయి వేలాడుతూ కనిపించినది అని కుటుంబ సభ్యులు ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకున్నాము అని తెలిపారు.