Monday, January 27, 2025

ర్యాష్ డ్రైవింగ్‌.. రాయదుర్గంలో బీటెక్ విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సిటీలో ఘోరో రోడ్డు ప్రమాదం జరిగింది. రాయదుర్గం పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ యవకుడు స్కూటీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న బీటెక్ విద్యార్థిని శివాని(21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్కూటీ నడుపుతున్న యువకుడు వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన యువకుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News