Monday, December 23, 2024

ఉరి వేసుకొని బి.టెక్ విద్యార్ధి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కీసరః బి.టెక్ విద్యార్ధి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈసంఘటన కరీంగూడ గ్రామంలో చోటు చేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కరీంగూడ గ్రామానికి చెందిన నల్లరాళ్ల గోవర్దన్‌రెడ్డి కుమారుడు ఆకాష్‌రెడ్డి (20) చీర్యాల్‌లోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ సీఎస్‌ఈ 3వ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం అర్ధరాత్రి నా చావుకు ఎవరు కారణం కాదు. నాన్న అక్కను బాగా చూసుకొండి, మీరు బాగా ఉండండి అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లోని తన గధిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఉదయం గమనించిన తండ్రి గోవర్దన్‌రెడ్డి విలపిస్తూ దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. కుమారుడు బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఆకాష్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి సూసైడ్ నోట్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News