Sunday, January 19, 2025

గీతం విశ్వ విద్యాలయంలో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం గీతం విశ్వ విద్యాలయంలో బిటెక్ ద్వితయ సంవత్సరం (సిఎస్‌సి) చదువుతున్న వర్ష (19) ఆత్మహత్యతో గీతం విశ్వ విద్యాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక సిఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు రాయలసీమ అనంతపురంకు చెందిన వర్ష గీతం విశ్వ విద్యాలయంలోని హాస్టల్‌లో ఉంటూ బిటెక్ ద్వితీయ (సిఎస్‌సి) సంవత్సరం చదువుకుంటుంది. కాగా శుక్రవారం మధ్యాహ్నం సమయంలో తన రూం మెట్ బయటకు వెళ్లింది. రూంమెట్ బయటకు వెళ్లిన సమయంలో చదువుకుంటుంది.అయితే తన రూంమెంటు తిరిగి సుమారు 0.45 నిముషాల తర్వాత తన గదికి వచ్చింది.

అప్పటికే రూం గది మూసుకొని ఉండడంతో సహ విద్యార్థిని తలపు తీయడానికి ప్రయత్నించడంతో రాకపోడంతో సెక్యురిటీ సిబ్బంది వచ్చి తలుపు తీశారు. అప్పటికే వర్ష గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉన్న విషయాన్ని గమనించి హుటాహుటినా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే వర్ష మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపడంతో మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా విద్యార్థిని తల్లిదండ్రులు అనంతపూర్ నుంచి రావాల్సి ఉందని వారు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని సిఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News