- Advertisement -
కాలేజ్ భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదం సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి చెందిన కృష్ణవేణి అనే విధ్యార్థిని బీటెక్ చదువుతోంది. శనివారం తెలవారుజామున కాలేజ్ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే, సూసైడ్ చేసుకునే ముందు..హాస్టల్ గదిలో తల్లితో కృష్ణవేణి ఉన్నట్లు తెలుస్తోంది. కాలేజ్ యాజమాన్య వేధింపులే ఆత్మహత్యకు కారణమా? లేక కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -