Saturday, November 16, 2024

బీటెక్ విద్యార్థిని దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

BTech Student killed in Guntur

అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. దీంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని కాకాణి రోడ్డులో బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి, యువతిని బలవంతంగా బైక్ ఎక్కించుకనే ప్రయత్నం చేయగా..అందుకు నిరాకరించడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. మెడ కింది భాగంలో, పొట్టపై విచక్షణారహితంగా ఐదుసార్లు పొడవడంతో యువతి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసులో యువతి సెల్ ఫోన్ కీలకంగా మారింది.

BTech Student killed in Guntur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News