Wednesday, January 22, 2025

బిటెక్ విద్యార్థినిని కత్తితో పొడిచి… తాను పొడుచుకున్న ప్రేమోన్మాది

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కాలేజీలో బిటెక్ విద్యార్థిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి చంపి అనంతరం అతడు పొడుచుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజనుకుంటే పోలీస్ స్టేషన్ పరిధిలో లయస్మిత అనే విద్యార్థిని ప్రెసీడెన్సీ యూనివర్సిటీ కాలేజీలో బిటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. పవన్ కల్యాణ్ అనే యువకుడు న్రుపతుంగ యూనివర్సిటీలో బిసిఎ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆమె చదువుతన్న కాలేజీకి అతడు వచ్చాడు. కాలేజీ ఆవరణంలో ఆమె కడుపులో పలుమార్లు పొడిచి అనంతరం అతడు పొడుచుకున్నాడు.

వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కోలార్ జిల్లాలోని ముల్బాగల్ తాలూకాలోని ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అమ్మాయి తండ్రి తరుపున బంధువుగా యువకుడిని గుర్తించారు. లయస్మిత తల్లి రాజేశ్వరీ మాట్లాడారు. గత కొన్ని రోజుల నుంచి ప్రేమించాలని తన కూతురు వెంట పవన్ పడ్డాడని తెలిపింది. అతడి ప్రేమను తన కూతురు అంగీకరించలేదని తెలిపాడు. దీంతో ఆమెను అతడు చంపాలని నిర్ణయం తీసుకున్నాడని వెల్లడించింది. తన కూతురికి కాలేజీలో భద్రత కల్పించాలని యూనివర్సిటీ అధికారులను కోరామని తెలిపింది. కానీ వాళ్లు పట్టించుకోలేదని వాపోయింది. తన కూతురు మృతికి యూనివర్సిటీ కారణమని రాజేశ్వరీ ఆరోపణలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News