ట్వీట్ చేసిన ఆనంద్ మహింద్ర.. నెటిజన్లు ఫిదా
మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీం ద్ర తరచూ పలు ఆసక్తికర అంశాలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా నెక్ట్ జనరేషన్ ఆఫ్ టా లెంట్ అంటూ నడిరోడ్డుపై ఓ బాలుడు చేసిన అద్భుత విన్యాసాలతో కూడిన వీడియోను నెట్టింట షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో బాలుడు రోడ్డు మధ్యలో గాలిలోకి ఎగురుతూ జంప్ చేస్తూ చేసిన జిమ్నాస్టిక్ విన్యాసాలు ఆకట్టుకున్నా యి. ఈ టాలెంట్‌ను ఫాస్ట్‌ట్రాక్‌లో మనం పదును పెట్టు పెట్టాల్సిన అవసరం ఉందనే క్యాప్షన్‌తో ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తమిళనాడులోని తిరునల్వేలి సమీపంలోని ఓ గ్రామంలో విన్యాసాలు చేస్తుండగా తన స్నేహితుల్లో ఒకరు చూసి వీడియో ను పోస్ట్ చేశారని మహీంద్రా పేర్కొన్నారు.
కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో స్వర్ణం గెలుచుకున్న తర్వాత ఈ నైపుణ్యాలు ముందుకొస్తున్నాయని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 1,18,000కి పైగా వ్యూస్ రాగా 6000కు పైగా లైక్స్ వచ్చాయి. ఈ చిన్నారి భవిష్యత్ ప్రపంచ జిమ్నాస్టిక్ చాంపియన్ అని పలువురు నెటిజన్లు ప్రశ్నించగా, ఈ బాలుడికి శిక్షణ ఇప్పించి, భారత ఒలింపిక్స్ టీమ్‌లో చేర్చేలా ఎవరో ఒకరు చొరవ చూ పాలని మరికొందరు యూజర్లు భావించారు. ఈ బుడతడు జిమ్నాస్టిక్ ట్రి క్స్‌ను ఇప్పటికే నేర్చుకున్నాడని మరో నెటిజన్ ప్రశంసించారు. ఇక ఇండియా రాక్స్ సూపర్‌స్టార్ అంటూ మరికొందరు బాలుడిని ఆకాశానికెత్తేశారు.