Wednesday, January 22, 2025

’బబుల్‌గమ్’ పెద్దగా పేలుతుంది..(ట్రైలర్‌ లాంచ్)

- Advertisement -
- Advertisement -

రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యంగ్ హీరో రోషన్ కనకాల తొలి చిత్రం ’బబుల్‌గమ్’ టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బబుల్‌గమ్ థియేట్రికల్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ట్రైలర్ లాంచ్ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ ఈవెంట్‌లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. “బబుల్‌గమ్ ట్రైలర్‌లో సూపర్ హిట్ కళ కనిపిస్తోంది. బబుల్‌గమ్ మెల్లగా ఉబ్బి ఉబ్బి పెద్దగా పేలుతుంది. ఈ సినిమా టాక్ కూడా మెల్లగా ప్రారంభమై సూపర్ హిట్ టాక్ తో ముగుస్తుంది. రోషన్, మానస కెమిస్ట్రీ చాలా బావుంది”అని అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “బబుల్‌గమ్ సినిమాలో యూత్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. రోషన్ చాలా యూనిక్‌గా వున్నాడు. తన పర్ఫార్మెన్స్ విలక్షణంగా ఉంది” అని పేర్కొన్నారు.

దర్శకుడు రవికాంత్ పెరేపు మాట్లాడుతూ.. “ట్రైలర్ కంటే సినిమా ఇరవై రెట్లు ఎక్కువగా అద్భుతంగా ఉంటుంది. సినిమా అందరికీ క్రేజీక్రేజీగా నచ్చుతుంది. రోషన్, మానస చాలా అద్భుతంగా నటించారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోషన్, మానస చౌదరి, సుమ, రాజీవ్ కనకాల, వివేక్ కూచిభొట్ల, శ్రీచరణ్ పాకాల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News