Friday, November 22, 2024

బుచ్చిబాబు ట్రోఫీ విజేత హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన ఆలిండియా బుచ్చి బాబు క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ టీమ్ విజేతగా నిలిచింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ జట్టు బుచ్చి బాబు ట్రోఫీని సొంతం చేసుకుంది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరిగింది. ఇక ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 243 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 518 పరుగుల భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గఢ్ హైదరాబాద్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 274 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఆయుష్ పాండే అద్భుత సెంచరీ సాధించినా ఫలితం లేకుండా పోయింది. ఆయుస్ పాండే 134 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 117 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శశాంక్ చంద్రశేఖర్ (50) అతనికి అండగా నిలిచాడు. ఇక హైదరాబాద్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అనికేత్ రెడ్డికి రెండు వికెట్లు దక్కాయి. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 417, రెండో ఇన్నింగ్స్‌లో 281 పరుగులు సాధించింది. కాగా, ఛత్తీస్‌గఢ్ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కుప్పకూలింది.

జగన్‌మోహన్‌రావు అభినందనలు..
ప్రతిష్ఠాత్మకమైన ఆలిండియా బుచ్చి బాబు క్రికెట్ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ టీమ్‌ను హెచ్‌సిఎ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు అభినందించారు. అసాధారణ ఆటతో హైదరాబాద్ ఆటగాళ్లు ట్రోఫీని సాధించడం గర్వంగా ఉందన్నారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి క్రికెటర్‌ను అభినందనలు తెలిపారు. రానున్న టోర్నీల్లో కూడా ఇలాంటి ప్రదర్శనతో జట్టు ప్రతిష్టను ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News