Monday, December 23, 2024

సంచార జాతులకు పెద్దపీట: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Buda Bukkala Community Hall building foundation

సిద్ధిపేట: సంచార జాతులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు పెద్దపీట వేసిందని, సిఎం కెసిఆర్ నేతృత్వంలో సంచార జాతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.  మీ బుడ బుక్కల జాతిని గుర్తించి తెలంగాణ రాష్ట్రంలోనే మీ జాతి గర్వించేలా మొదటి బుడ బుక్కల భవనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేట  పట్టణంలోని 18వ వార్డులో వెంకటేష్ కళామందిర్ టాకీసు సమీపంలో బుడ బుక్కల కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సంచార జాతులను గుర్తించి వారికి సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్న బుడ బుక్కల కులస్తుల అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇంటి అడుగు జాగలో స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు మంజూరు చేయిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం 21వ వార్డులో సిసి రోడ్లు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News