Thursday, January 23, 2025

సాగర్‌లో ఘనంగా 2567వ బుద్ధ పూర్ణిమ జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలోని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 2567వ బుద్ధజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, బౌద్ధ బిక్షువులు పాల్గొన్ని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వద్ద బుద్ధ జయంతి వేడుకలు ప్రారంభమైయ్యాయి.ఈ సందర్భంగా హైదరాబాద్ 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ నుండి నాగార్జునసాగర్ బుద్ధవనం వరకు దాదాపు 200 కార్ల ర్యాలీ నిర్వహించారు.

అనంతరం బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ 2000 ఏండ్ల క్రితమే శాంతియుత సహజీవన సూత్రాలను కార్యచరణ విశ్వమానవాళికి అందించిన బుద్ధుడు సంచరించిన నేలమీద జీవిస్తుండడం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయమని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. వర్ణ, లింగ, జాతి తదితర వివక్షతలను ద్వేషాలకు వ్యతిరేకంగా, మహోన్నతమైన దార్శనికతతో తాత్విక జ్ఞానంతో బుద్ద భగవానుడు నాడు బోధించి ఆచరించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సూత్రాలు అజరామరమైనవి అన్నారు. మానవ సమాజం కొనసాగినన్నాల్లూ బుద్ధుని బోధనలకు ప్రాసంగిత వుంటుందని తెలిపారు. అనంతరం విద్యుత్ కాంతులతో బుద్ధవనం ప్రాంగణం మొత్తం అలంకరించారు.

బుద్ధ జయంతి వేడుకలు తిలకించడానికి స్థానికులు, నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా, ప్రొఫెసర్ సుఖడియో తొరట్, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్‌రెడ్డి, ఏఏఈ వినల్‌కుమార్, చంద్రమౌళి నాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య, కండెల నాగరాజు, లక్ష్మణ్‌నాయక్, మహేష్, ప్రదీప్‌కుమార్, శ్రీకర్‌నాయక్ మరియు బౌద్దబిక్షువులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News