- Advertisement -
ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: కొవిడ్-19 సంక్షోభాన్ని సమస్త మానవాళి ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో బుద్ధ భగవానుని సిద్ధాంతాలు సమాజానికి ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆషాఢ పూర్ణిమ, ధమ్మ చక్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ శనివారం ఒక సందేశం విడుదల చేస్తూ బౌద్ధ మంత వ్యవస్థాపకుడు చూపిన బాటను అనుసరించి అత్యంత క్లిష్టమైన సవాలును ఎలా ఎదుర్కోవచ్చో భారత్ చూపిందని అన్నారు. బుద్ధుని బోధనలు అనుసరించడం ద్వారా యావత్ ప్రపంచం సంఘటితంగా నడుస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ధమ్మపదను ఉటంకిస్తూ శత్రుత్వాన్ని శత్రుత్వం నశింపచేయలేదని ప్రధాని అన్నారు. ఈ విషాద సమయంలో ప్రేమ, సామరస్యాన్ని ప్రపంచం గుర్తించిందని ఆయన చెప్పారు.
- Advertisement -