Saturday, November 23, 2024

బౌద్ధమే ఆచరణీయం

- Advertisement -
- Advertisement -

Buddha Purnima celebrations

 

మానవాళి ప్రగతికోసం నేటికీ బౌద్ధం చూపిన బాటలోనే : సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణి మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతికోసం బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీమయన్నారు. తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు, శాంతి సహనంతో కూడిన అహింసాయుత జీవన విధానం, వీటిలోని మూలాలు బౌద్ధ వారసత్వం నుంచే అలవడ్డాయని సిఎం వివరించారు. ఫణిగిరి వంటి నాటి బౌద్దారామాల్లో బయల్పడుతున్న అరుదైన బౌద్ద చారిత్రక సంపంద, గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాలను అల్లుకొని తెలంగాణలో బౌద్ధం పరిఢవిల్లిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని సిఎం తెలిపారు. నాగార్జున సాగర్‌లో ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నదని సిఎం అన్నారు. రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ కేంద్రాలను పునరుజ్జీవింప చేసి ప్రపంచ బౌద్దపటంలో తెలంగాణకు సముచితస్థానాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రజా సంక్షేమం, ప్రగతి కోసం పాటుపడడం ద్వారా మాత్రమే భగవాన్ గౌతమబుద్ధునికి నిజమైన నివాళి అర్పించగలుగుతామని, తెలంగాణ ప్రభుత్వం అదే దిశగా ముందుకు సాగుతున్నదని సిఎం కెసిఆర్ అన్నారు.

త్వరలోనే బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ని ర్మిస్తున్న బుద్ధవనం ప్రాజెక్టు పూర్తయిందని, కొవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత సిఎం కెసిఆర్ దీనిని ప్రారంభిస్తారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలి పారు. బుద్ధ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్చువల్ సమా వేశంలో బౌద్ధ సన్యాసులతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని ఇతర ప్ర దేశాల్లో కోటి లింగాల, నేలకొండపల్లి, ధూళికట్ట, ఫణిగిరి వద్ద బౌద్ధ చారి త్రక ప్రదేశాల చర్యలు తీసుకుంటామన్నారు. ఈ బుద్ధవనం ప్రాజెక్టుకు అనుబంధంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బుద్ధిజం అం తర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ నిర్మాణానికి కృషి చేస్తు న్నామన్నారు. సిఎం అభినవ బుద్ధుడని ఈ సందర్భంగా ఆయన అభి వర్ణించారు. అనంతరం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో బుద్ధ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News