Saturday, December 21, 2024

మానేరు రివర్ ఫ్రంట్ పై బుద్దుని విగ్రహం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పై దళితుల గౌరవార్దం బుద్దుని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి విజిలేన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశములో రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గోన్నారు.

ఈ సందర్బంగా సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, దళితుల గౌరవార్దం జిల్లాలో నిర్మిస్తున్న మానేరురివర్ ఫ్రంట్ పై బుద్దుని విగ్రహన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దళితుల పట్ల వివక్షరహితంగా, గౌరవ ప్రదంగా వ్యవహరిస్తున్నామని, దళితులపై ఇప్పటివరకు రాష్ట్రంలోనే ఎటువంటి అమానుష చర్యలు చోటుచేసుకోలేదని తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం దళితబందు పథకాన్ని ప్రవేశపెట్టి ఉన్నత పారిశ్రామీక వేత్తలుగా దళితులను తీర్చిదద్దడం జరిగిందన్నారు. దళితులను వెలివేసిన ఇతర ఎటువంటి సంఘటనలు జరిగిన, జరిగినట్లు ఏవిధంగానైన తెలిసిన వాటిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాగాన్ని ఆదేశించారు. పారితోషకాల విషయంలో కూడా ఆలస్యంజరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో ఎస్సి, ఎస్టీ అట్రోసిటి బాదితులకు ఇప్పటి వరకు రూ. 37.28 లక్షలు పరిహారం చెల్లించడం జరిగిందని, ఈ సంవత్సరంలో 58 అట్రోసిటి కేసులు నమోదుకాగ, అందులో 10 తప్పుడు కేసులని, 13 ఛార్జ్ షీట్, 35 ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయన్నారు. అట్రోసిటి కేసుల పరిహారం మరియు ఇన్వెస్టిగేషన్ త్వరత్వరగా పూర్తీచేసేలా కృషిచేయడం జరుగుతుందని తెలిపారు.

పోలీస్ కమీషనర్ ఎల్. సుబ్బారాయుడు, షెడ్యూల్ కులాల అభివృద్ది అధికారి పి. నతానియేల్, కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్ కమిటీ సభ్యులు మేడి మహేష్, ఎలుక ఆంజనేయులు, కులదీప్ వర్మ, తడగొండ నర్సిం బాబు, లకవాత్ రవి, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News