- Advertisement -
కాకినాడ: వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిని జైలుకు పంపే వరకు వదిలిపెట్టబోనని టిడిపి ఎంఎల్ సి బుద్దా వెంకన్న అన్నారు. కాకినాడ సీ పోర్టు వివాదంలో వచ్చిన ఆరోపణలపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. విజయసాయి రెడ్డికి మానవ విలువలు తెలియని విమర్శించారు. చంద్రబాబుకు కుల పిచ్చి ఉందని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ కు, విజయసాయి రెడ్డికి కుల పిచ్చి ఉందేమోగాని, చంద్రబాబుకు లేదన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై క్రిమినల్ కేసులు వేస్తానని అన్నారు. జగన్ హయాంలో వ్యాపారవేత్తలను భయపెట్టి ఆస్తులు రాయించుకున్నారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -