Sunday, February 2, 2025

జగన్ నుంచి ఎంపి కుటుంబానికి ప్రాణహాని: బుద్దా

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖపట్నం ఎంపి కుటుంబ సభ్యుల కిడ్నాప్‌పై టిడిపి నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి నుంచి ఎంపి కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపణలు చేశారు. సిబిఐ విచారణ జరిపాలని బుద్ధా డిమాండ్ చేశారు. విశాఖ ఎంపి కుటుంబం కిడ్నాప్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కిడ్నాప్ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని టిడిపి, బిజెపిన నేతలు సందేహం వ్యక్తం చేశారు. ఎంపి ఎదో దాచిపెడుతున్నారని విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Also Read: పుజారాపై వేటు తప్పదా?

ఎంపి కుటుంబం కిడ్నాప్ కేసులో కుట్ర ఉందని టిడిపి నేత విష్ణు కుమార్ రాజు తెలిపారు. ఈ కేసును సిబిఐ, ఎన్‌ఐఎతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది కిడ్నాప్ కాదని, సెటిల్మెంట్ వ్యవహారమన్నారు. ఎంపి ఇంటికి ఓ ఆకు రౌడీ వెళ్లాడంటే సాధారణ విషయం కాదని, కడప, పులివెందుల బ్యాచ్‌లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందని విష్ణు కుమార్ తెలిపారు. సెల్‌ఫోన్ డేటా తీస్తే వ్యవహారం బయటకు వస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News