- Advertisement -
నాగార్జునసాగర్ ః హరిత విజయ విహార్ ప్రాంగణంలో ఉన్న మినీ బుద్ధవనం బౌద్ధ పరిశోధకులను ఆకర్షిస్తుందని, బుద్ధవనం బుద్దిస్ట్ ఎక్సపర్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. అనంతరం మాట్లాడుతూ బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య సలహా మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన బౌద్ద పరిశోధకులు డాక్టర్ మాయా జోషి ఆచార్య చౌడూరి ఉపేందర్‌రావులకు ఆయన మినీ బుద్దవనంలోని అమరావతి మధుర, గాంధార శిల్ప శైలిలో చెక్కి ప్రదర్శనలో ఉంచిన బోధిసత్వ తార మైత్రేయనాథ, ధ్యాన బుద్ధస్థానిక బుద్ద శిల్పాల ప్రాశస్యాన్ని వివరించామని తెలిపారు.
ఈ శిల్పాలు తమనెంతో ఆకట్టుకున్నాయని డాక్టర్ మాయా జోషి, ఆచార్య ఉపేందర్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బుద్దవనం డిజైన్స్ ఇంచార్జి డీఆర్ శ్యాంసుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -