Saturday, January 11, 2025

బడ్డీ మూవీ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 26న ‘బడ్డీ‘ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ “శామ్ ‘బడ్డీ’తో మా సంస్థకు మరో మంచి సినిమా ఇస్తున్నాడు. నేను ఈ కథ కంటే శామ్‌ను ఎక్కువ నమ్మాను.

అల్లు శిరీష్ మా కుటుంబ సభ్యుడు లాంటి వారు. ఆయన ఫేవరేట్ హీరో సూర్య. మా జర్నీలో గుడ్, బ్యాడ్ టైమ్స్‌లో శిరీష్ సపోర్ట్‌గా ఉన్నారు. జూలై 26న బడ్డీ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం”అని అన్నారు. దర్శకుడు శామ్ ఆంటోన్ మాట్లాడుతూ- “నేను డైరెక్టర్ రాజమౌళి ఫ్యాన్ ను. ఆయన చేసిన ఈగ సినిమా ఈ బడ్డీ మూవీకి ఇన్‌స్పిరేషన్‌”అని తెలిపారు. హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ “టెడ్డీ బేర్‌తో అడ్వెంచర్ యాక్షన్ మూవీ, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అనుకున్నా. కానీ బడ్డీ ట్రైలర్ చూశాక నాకు చాలా నమ్మకం వచ్చింది. కొత్త తరహా సినిమా ఎప్పుడు వచ్చినా మన ప్రేక్షకులు ఆదరిస్తారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్, మధుర శ్రీధర్ రెడ్డి, అలీ, అజ్మల్, కృష్ణన్ వసంత్, రూబెన్, సాయి హేమంత్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News