Saturday, December 21, 2024

బడ్జెట్ ఎఫెక్ట్: ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రదర్శించిన బడ్జెట్‌లో కొన్ని వస్తువుల ధరలు పెరగ్గా, కొన్నిటి ధరలు తగ్గించారు. బంగారం, వెండి, ప్లాటినం వంటి ఇతర విలువైన లోహాలు,దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లు, నిర్ధిష్టమైన క్యాన్సర్ ఔషధాలు, వైద్య పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్టు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో ఇవి చవకగా అందుబాటు లోకి రానున్నాయి. ఇక ధరలు పెరిగిన వస్తువుల్లో దిగుమతి చేసుకున్న గార్డెన్ అంబ్రెల్లాలు,లేబొరేటరీ రసాయనాలపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో వీటి ధరలు ప్రియం కానున్నాయి.

ధరలు తగ్గేవి

విలువైన లోహాలు

బంగారం, వెండి వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని10 నుంచి 6 శాతానికి తగ్గించారు. ప్లాటినం , పల్లాడియం,ఓస్మియమ్, రుథేనియం, ఇరీడియం వంటి విలువైన లోహాలపై కస్టమ్స్ డ్యూటీ 15.4 శాతం నుంచి 6.4 శాతం వరకు తగ్గించారు. ఇవి కాకుండా 25 ముఖ్యమైన ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీలో మినహాయింపు ప్రకటించారు. విలువైన లోహాల నాణేలు. విలువైన లోహాల తయారీలో మూలకాల సమ్మేళనాల్లో, ఉత్ప్రేరకాల్లో ప్లాటినం, పెల్లేడియం ఉపయోగిస్తుంటారు.

మూడు క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
ట్రస్టుజుమాబ్ డెరక్స్‌టెకన్, ఒసిబెర్టినిబ్, దుర్వలుమాబ్ ఈ మూడు రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించారు.దీంతో క్యాన్సర్ రోగులకు మేలు చేసినట్టయింది.

వైద్య పరికరాలు
ఆర్థోపెడిక్ పరికరాల తయారీలో పోలీఇథలిన్ అన్ని రకాలు ఉపయోగపడుతుంటాయి. వైద్యరంగంలో సర్జికల్, డెంటల్, లేదా వెటర్నరీలో ఉపయోగించే ఎక్స్‌రే యంత్రాల తయారీకి ఎక్స్ రే ట్యూబ్స్, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లు ఉపయోగపడుతుంటాయి. వీటన్నిటి ధరలు బడ్జెట్‌లో తగ్గుతున్నట్టు ప్రకటించారు.

మొబైల్ ఫోన్లపై 15 శాతం డ్యూటీ తగ్గింపు
దిగుమతి చేసుకునే సెల్యులర్ మొబైల్ ఫోన్లు, ఫోన్ చార్జర్లు, అడాప్టర్లు, ప్రింటెడ్ సర్కూట్ బోర్డ్ అసెంబ్లీ (పిసిబిఎ)పై 15 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీంతో స్థానికంగా మొబైల్ ఫోన్ల తయారీ పెరగడమే కాక, ఎగుమతులు పెరుగుతాయి. దీంతో మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు చౌకగా లభిస్తాయి.

సోలార్ పరికరాలు
సోలార్ సెల్స్ తయారీకి ఉపయోగపడే వస్తువులు, సోలార్ మోడ్యూల్స్, వాటి తయారీకి వినియోగించే పరికరాలు ఉన్నాయి.

సీఫుడ్స్

చేపలు, రొయ్యల ఫీడ్‌పై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 5 శాతం తగ్గించారు. ఫీడ్, చేప చమురు ధరలు తగ్గుతాయి.
నేచరల్ గ్రాఫైట్
గ్రాఫైట్‌కు ఉపయోగించే అన్ని రకాల సహజ ఇసుక, క్వార్ట్, కీలకమైన ఖనిజాలు, లిథియం కార్బొనేట్, లిథియం ఆక్సైడ్, హైడ్రాక్సైడ్, పొటాషియమ్ నైట్రేట్స్
ఉక్కు రంగం
ఫెర్రో నికెల్, బ్లిస్టర్ కాపర్,
వస్త్ర, చర్మ పరిశ్రమ
వస్త్రాలు, లెదర్ ఉత్పత్తిలో స్పాండెక్స్ యార్న్ (సింథటిక్ దారం) తయారీకి అవసరమైన మెథిలిన్ డైఫినైల్, డై ఐసోసైనేట్.

ధరలు పెరిగేవి

పోలీ వినైల్ క్లోరైడ్ (పివిసి) ఫ్లెక్స్ ఫిలింలు, గార్డెన్ అంబ్రెల్లాలు, లేబొరేటరీ రసాయనాలు, సోలార్ సెల్స్ , మాడ్యూల్స్ తయారీకి కావలసిన సోలార్ గ్లాస్, టిన్డ్ కాపర్. పివిసి ఫ్లెక్స్ బ్యానర్లపై 10 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 25 శాతానికి పెంచడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News