Friday, November 22, 2024

టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు వడ్డీలేని రుణాలు

- Advertisement -
- Advertisement -

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు, ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు వచ్చినందున ఇది మధ్యంతర బడ్జెట్. పాత, కొత్త పాలనలలో పన్ను స్లాబ్‌లలో ఎటువంటి మార్పులు ప్రకటించబడలేదు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… దేశంలోని మరిన్ని నగరాలకు మెట్రో రైళ్లు విస్తరణ చేయనున్నట్లు ప్రకటించారు. ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహిస్తాం.. టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు తమ సర్కార్ ప్రయత్నాలు మొదలు పెట్టిందని వెల్లడించారు. టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్.. టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. లక్షద్వీప్ లో టూరిజం అభివృద్దికి మౌళిక వసతులు పెంచుతామని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News