Saturday, December 21, 2024

ఉద్యోగులకు మేలు చేకూర్చేలా కొత్త పెన్షన్ స్కీమ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉద్యోగుల సామాజిక భద్రతా ప్రయోజనాలను మెరుగుపర్చేలా నూతన పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) ను రూపొందించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో వెల్లడించారు. పెన్షన్ స్కీమ్‌ల సమీక్షకోసం ఫైనాన్స్ సెక్రటరీ టివి సోమనాథన్ నేతృత్వంలో ఒక కమిటీ గత ఏడాది ఏర్పాటైంది. కొత్త పెన్షన్ విధానం పురోగతి చెందేలా కమిటీ పర్యవేక్షిస్తుందని సీతారామన్ ప్రకటించారు.

పాత పెన్షన్ స్కీమ్ కింద రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తాము ఆఖరిసారి పొందే వేతనంలో 50 శాతం నెలవారీ పెన్షన్‌గా పొందడమవుతోందని చెప్పారు. ఈమొత్తం డిఎ రేటు ప్రకారం పెరుగుతుందని మంత్రి తెలిపారు. అయితే ప్రస్తుతం యాజమాన్యాలు తమ ఉద్యోగుల నూతన పెన్షన్ స్కీమ్‌కు తమ వాటాగా చెల్లించే మొత్తం(మూల వేతనం డీఎతో కలిపి)పై 10 శాతం వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుండగా, ఇప్పుడు 14 శాతానికి పెంచినట్టు మంత్రి తెలిపారు.

ప్రైవేట్ రంగ ఉద్యోగులు కానీ ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు కానీ కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే వారికి కూడా ఎన్‌పిఎస్ వాటాపై 14 శాతం వరకు పన్ను రాయితీ లభిస్తుందని మంత్రి తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పొదుపు చేయడానికి వీలుగా కొత్త పెన్షన్ పథకంలో ‘ఎన్‌పిఎస్ వాత్సల్య’ అనే పథకాన్ని ప్రతిపాదించనున్నట్టు మంత్రి సీతారామన్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News