Wednesday, January 22, 2025

ఆరోగ్యమంత్రిత్వశాఖకు రూ 90,658 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర తాత్కాలిక బడ్జెట్‌లో ఆరోగ్యమంత్రిత్వశాఖకు ఈసారి రూ 90,658.63 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. ఇంతకు ముందటి బడ్జెట్ 202324తో పోలిస్తే ఇప్పటి 2024 25 బడ్జెట్‌లో ఈ కీలక శాఖకు కేటాయింపులు 12.59 శాతం పెరిగాయి. అప్పటి బడ్జెట్‌లో సవరించిన కేటాయింపులు మొత్తం విలువ రూ 80,517.62 కోట్లుగా ఉంది. ఇప్పుడున్న ఆసుపత్రుల నిర్మాణ వ్యవస్థలను వినియోగించుకుని ప్రభుత్వం అదనంగా మరికొన్ని వైద్యకళాశాలలను ఏర్పాటు చేసే యోచనలో ఉందని వివరించారు. దీని కోసం ఏ కమిటీ ఏర్పాటు జరుగుతుంది.

ఈ కమిటీ సంబంధిత విషయంలో తగు సిఫార్సులు చేస్తుందని మంత్రి తెలిపారు. ఇప్పుడు కేటాయించిన రూ 90వేల కోట్లకు పైగా నిధులలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ 87, 656.90 కోట్లు , ఆరోగ్య పరిశోధనా విభాగానికి రూ 3001.73 కోట్లు సమకూరుస్తారు. ఆయుష్షు మంత్రిత్వశాఖకు ఇంతకు ముందు రూ 3000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు దీనిని రూ 3,712.49 కోట్లకు పెంచారు. ఈ విధంగా ఆయుష్షు మంత్రిత్వశాఖ కేటాయింపులు 24 శాతం వరకూ పెరిగాయి.

జల్‌జీవన్ పథకానికి అత్యధిక కేటాయింపులు
ఈసారి కేంద్ర బడ్జెట్‌లో జలాల వాడకం , వెలికిలోకి తీసుకువచ్చే విషయాల జలశక్తి మంత్రిత్వశాఖకు రూ 98,418 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధికంగా 71 శాతం వరకూ నిధులు ప్రతిష్టాత్మక జలజీవన్ పథకానికి దక్కుతాయి. ఇంతకు ముందటి బడ్జెట్‌లో ఈ మంత్రిత్వశాఖకు రూ 96,549 కోట్లు కేటాయించారు. ఇక తాగునీరు, పారిశుద్ధం విభాగం (డిఒడిడబ్లుఎస్) వాటా రూ 77,390 కోట్లు. ఇంతకు ముందటి బడ్జెట్‌తో పోలిస్తే ఇది నామమాత్రపు 0.4 శాతం హెచ్చింపే. జలజీవన పథకానికి జరిగిన కేటాయింపుల విలువ ఇప్పుడు రూ 69,926 కోట్లు. ఈ పథకం పరిధిలో 2024 నాటికి గ్రామీణ భారతంలో అన్ని నివాసాలకు సురక్షిత నీటిని సమృద్థిగా అందించే లక్షం పెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) పరిధిలోకి వచ్చే పనులకు రూ 7,192 కోట్లు కేటాయించారు. ఇంతకు ముందటి బడ్జెట్‌లో కూడా ఇంతే మొత్తం అలాట్ అయింది.

* జలవనరుల విభాగంకోసం రూ 21,028 కోట్లు కేటాయించారు. నదుల అభివృద్ధి, గంగా జలాల పునరుజ్జీవ పథకాలు కూడా ఈ కేటాయింపుల పరిధిలో వ్యయానికి నోచుకుంటాయి. ఇంతకు ముందటి కేటాయింపులతో పోలిస్తే ఈసారి 7.74 శాతం పెరుగుదల ఉంది.
* గంగాజలాల శుద్ధికి సంబంధించిన జాతీయ గంగా పథకం పరిధిలోగంగానది, ఉపనదుల శుద్ధి వంటి పలు కార్యక్రమాల అమలుకు జలవనరుల నిధుల్లోనే రూ 3500 కోట్లు కేటాయించారు. కేంద్ర జల సంఘానికి రూ 391 కోట్లు కేంద్ర జల, విద్యుత్ పరిశోధన కేంద్రానికి రూ 75 కోట్లు, జాతీయ భూగర్భ జల మండలికి రూ 310 కోట్లు కేటాయించారు. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన పరిధిలో ఈసారి రూ 2500 కోట్లు నిధులు సమకూరుతాయి.

ఆశా అంగన్‌వాడీ వర్కర్లకూ ఆయుష్మాన్ భారత్ వర్తింపు
దేశంలో ఇప్పుడున్న ఆయుష్మాన్ భారత్ బీమా పథకం పరిధిలోకి ఆశా, అంగన్‌వాడి వర్కర్లను కూడా తీసుకువస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. సంబంధిత విషయంలో ఆలోచన జరుగుతోందని, ఈ క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ బీమా పథకం వర్తింపచేయడం వల్ల వారికి సామాజికంగా కుటుంబపరంగా సరైన విధంగా మేలు జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News