హోంశాఖకు రూ.6,465 కోట్లు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కార్యాలయాలకు రూ.725 కోట్లు సాంకేతికతకూ పెద్దపీట
మనతెలంగాణ/హైదరాబాద్: శాంతిభద్రతలు, పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తూ 2021లో బడ్జెట్లో హోంశాఖకు 6,465 కోట్లు కేటాయించినట్లు శాసనసభలో ఆర్థి క మంత్రి హరీష్రావు ప్రకటించారు. రాష్ట్రం ఏర్ప డిన అనంతరం పోలీసు వ్యవస్థను ఆధునీకరించ డంతో పాటు ఫ్రెండ్లీ పోలీసు విధానం అమలయ్యే లా చర్యలు చేపట్టారు. పోలీసు శాఖలో నూతన వా హనాలు, సాంకేతిక విధానాలకు భారీగా నిధులు కేటాయించారు. గుడుంబా, పేకాట, గ్యాంబ్లింగ్ల నిషేధాన్ని అమలు చేస్తున్నారు. కాగా కరోనా కా లంలో పోలీసు శాఖ స్ఫూర్తిదాయకమైన సేవలను అందించింది.
అందుకు వారికి అదనంగా ఒక నెల వేతనాన్ని ప్రభుత్వం అందించింది. అలాగే బహి రంగ ప్రదేశాలలో నిఘాతో పాటు పర్యవేక్షణ కో సం 6.65లక్షల సిసి కెమెరాలను ఏర్పాటు చేశా రు. దేశంలో ఉన్న మొత్తం సిసి కెమెరాలలో 65 శాతం మన రాష్ట్రంలోనే ఉన్నాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరి రక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ.6,465 కోట్లు కేటాయించిన క్రమంలోనే పోలీ సుశాఖ ఆధునీకరణకు పెద్దపీట వేస్తూ కమాండ్ కంట్రోల్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తూ అధిక నిధులు కేటాయిం చింది. దేశవ్యాప్తంగా రోల్మాడల్గా నిలిచిన షీ ఫేస్ రికగ్నేషన్, భరోసా సెంటర్లను మరిం త బలోపేతం చేసేందుకు ఆర్థికంగా సహకారం అందించింది.
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలం గాణ ప్రభుత్వం తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భారీ ప్రాజెక్టు, పోలీసు కార్యాల యాల నిర్మాణానికి ఏకంగా రూ. 725 కోట్లను దీ నికోసం ప్రతిపాదించింది. పోలీసు వ్యవస్థను ఆధు నికీకరించడంలో భాగంగా కెసిఆర్ సర్కార్ నిర్మి స్తోన్న కంట్రోల్ సెంటర్కు భారీగా నిధులను కేటా యించింది. ముందుగా ప్రకటించిన మొత్తం కంటే అధిక నిధులను బడ్జెట్ ప్రతిపాదనల్లోకి చేర్చింది.
ఈ భారీ ప్రాజెక్టు కోసం బడ్జెట్లో అత్యధిక మొ త్తాలను కేటాయిస్తామని ఇదివరకు ఉప ముఖ్య మంత్రి మహమూద్ అలీ ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యతను దృ ష్టిలో ఉంచుకున్న ఆర్ సర్కార్ హామీ ఇచ్చిన దాని కంటే 400 కోట్ల రూపాయల మొత్తాన్ని అధికంగా కేటాయించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ టవర్ అందుబాటులోకి వచ్చేలా నిర్మాణాన్ని పూర్తి చేయడానికే ఆశించిన దాని కంటే అధికంగా నిధు లను కేటాయించినట్లు వివరించారు.