Friday, December 20, 2024

క్రిప్టో ట్రేడింగ్‌పై టిడిఎస్, టిసిఎస్

- Advertisement -
- Advertisement -

Budget could consider levying TDS/TCS on crypto trading

బడ్జెట్ 2022లో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం

న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీల కొనుగోళ్లు, అమ్మకాలపై టిడిఎస్, టిసిఎస్‌లను అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వచ్చే నెలలో సాధారణ బడ్జెట్‌లో క్రిప్టో ట్రేడింగ్‌పై ఈ పన్నులను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆదాయ పన్నుకు చెందిన నిపుణుడు ఒకరు తెలిపారు. క్రిప్టోకరెన్సీల కొనుగోలు, విక్రయాలను ప్రభుత్వం పన్ను పరిధిలోకి తీసుకురానుందని, అలాంటి లావాదేవీలను ప్రత్యేక లావాదేవీలుగా గుర్తించనుందని నాంగియా అండర్సన్ ఎల్‌ఎల్‌పి చాక్స్ హెడ్ అరవింద్ శ్రీవాత్సన్ తెలిపారు. క్రిప్టోకరెన్సీల విక్రయం ద్వారా వచ్చే ఆదాయానికి లాటరీలు, గేమ్ షోలు, పజిల్స్ వంటి 30 శాతం అధిక పన్ను రేటును విధించే అవకాశముందని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 10.07 కోట్ల మంది క్రిప్టో ఇన్వెస్టర్లు ఉన్నారు. 2030 సంవత్సరం నాటికి భారతీయుల క్రిప్టోకరెన్సీ పెట్టుబడి 241 మిలియన్ డాలర్లకు పెరగవచ్చని శ్రీవాత్సన్ తెలిపారు.

క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని భావించారు. కానీ ఇది జరగలేదు. అయితే రాబోయే సాధారణ బడ్జెట్‌లో బిల్లును తీసుకురావచ్చని భావిస్తున్నారని ఆయన వివరించారు. క్రిప్టోకరెన్సీలలో ట్రేడింగ్ చేయకుండా ప్రభుత్వం భారతీయులను నిషేధించకపోతే, క్రిప్టోకరెన్సీల కోసం రిగ్రెసివ్ టాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టవచ్చని అంచనా వేస్తున్నామని అన్నారు. మార్కెట్ పరిమాణం, ప్రమేయం ఉన్న నగదు మొత్తం, క్రిప్టోకరెన్సీలతో ఉన్న రిస్క్‌ను పరిగణనలోకి తీసుకుని టిడిఎస్(టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్), టిసిఎస్ (టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్) పరిధిలోకి తీసుకురావడం వంటి కొన్ని మార్పులు తీసుకురావచ్చు. క్రిప్టోకరెన్సీల విక్రయం, కొనుగోలు రెండింటినీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ స్టేట్‌మెంట్ (ఎస్‌ఎఫ్‌టి) పరిధిలోకి తీసుకువచ్చే అవకాశముందని, ఇలా చేయడం ద్వారా వాటిని పర్యవేక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. లాటరీలు, గేమ్ షోలు, పజిల్స్ మాదిరిగా క్రిప్టోకరెన్సీల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంపై అత్యధికంగా 30 శాతం పన్ను విధించనున్నట్టు శ్రీవాత్సవ్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News