Tuesday, January 14, 2025

బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల భారీ అంచనాలు

- Advertisement -
- Advertisement -

ఆర్థిక మంత్రి నిర్మల కేటాయింపులు ఏ రంగాలకు..
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి : నిపుణుల అంచనా

న్యూఢిల్లీ : నేడు (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా మధ్యంతర బడ్జెట్‌లో కొత్త ప్రకటనలు చేయరు. ఈ బడ్జెట్‌లో కొత్త ప్రకటన చేయబోమని, అవసరమైన ఖర్చులను మాత్రమే కేటాయిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వెల్లడించారు. అయితే ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. అందువల్ల ఇన్వెస్టర్లు ఈ బడ్జెట్‌పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, వ్యవసాయాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిపెట్టనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వం గ్రామీణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఉత్పత్తి ఆధారిత ప్రొత్సాహకాలు(పిఎల్‌ఐ) పథకం పరిధిని కూడా పెంచవచ్చు. గతంలోనూ ప్రభుత్వం మూలధన వ్యయంపై వ్యయాన్ని పెంచింది. రైల్వేలు, రక్షణ, రహదారులపై కేంద్ర ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది. అందువల్ల ఈ రంగాలకు సంబంధించిన కంపెనీల షేర్లలో పెట్టుబడిదారులు ఆశలు చూడవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్-, మేలో దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో స్టాక్‌మార్కెట్‌లో ఎప్పుడూ హెచ్చు తగ్గులు ఉంటాయి.

మోడీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్
ఈ ఏడాది జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ రానుంది. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ రానుంది. మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, క్యాపిటల్ గూడ్స్, గ్రీన్ ఎనర్జీ, విచక్షణ వినియోగం, ఆరోగ్య సంరక్షణ ఇటీవలి కాలంలో మంచి పనితీరును కనబరుస్తున్నాయి. బడ్జెట్‌లో చేసిన ప్రకటనల నుండి ఈ రంగాలకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వం మౌలిక వసతులపై పెట్టుబడులు పెంచుతోందని చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం జిడిపిలో 1.13 శాతం ఉంది.

పెట్టుబడిదారులకు చాలా ముఖ్యమైనది
మేలో లోక్‌సభ ఎన్నికల అనంతరం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ఏడాది చివర్లో జరగాల్సి ఉంది. అందువల్ల ఈ సంవత్సరం పెట్టుబడిదారులకు చాలా ముఖ్యమైనది. గురువారం మధ్యంతర బడ్జెట్ తర్వాత లాభాలను చూపించే రంగాల గురించి ఇన్వెస్టర్లు ఊహాగానాలు చేస్తున్నారు. మధ్యంతర బడ్జెట్ వల్ల ఏ రంగానికి చెందిన కంపెనీల షేర్లు వృద్ధిని చూడగలవనేని స్టాక్ మార్కెట్ నిపుణులు స్పందిస్తూ, ఇది మధ్యంతర బడ్జెట్ అని, అందువల్ల ఇందులో ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలను స్పష్టంగా చూడటం కష్టమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News