Monday, December 23, 2024

బడ్జెట్ ఒక ప్రతిబంధకం కాదు: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -
Budget is not a constraint
న్యూఢిల్లీ: 1 డిసెంబర్ 2022 నుంచి జి20 అధ్యక్ష పదవిని భారత దేశం చేపట్టనుందని తెలియగానే సంతోషం కలిగిందని కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.  న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని కమిటీ రూమ్ “సి”లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంప్రదింపుల కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
జి20లో మన దేశం పాత్ర పేద, ప్రజల తక్కువ ఆదాయాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. జి20 ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడటానికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ప్రజలే కేంద్రంగా ఉండాలన్నారు.  ఈ రోజుల్లో  వినూత్న సాంకేతికతతో డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ గ్రామ స్థాయిలో కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే మెట్రోపాలిటన్ నగరాలు మంచి మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నామని, కానీ గ్రామీణ మారుమూల ప్రాంతాలు నేటికీ అలాగే ఉన్నాయన్నారు.  గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని కోమటి రెడ్డి డిమాండ్ చేశారు. దీని కోసం మరింత ఎక్కువ ఆర్థిక కేటాయింపులు అవసరం ఉందని నొక్కి చెప్పారు.
మన దేశ ప్రజలు తమ దైనందిన జీవితాన్ని గడపడానికి ఎల్లప్పుడూ అభద్రతను అనుభవిస్తున్నారని, పేద ప్రజలకు భారీ స్థాయిలో ఆహారం అందించడం చాలా అవసరమని, దీనికి బడ్జెట్ ఒక ప్రతిబంధకం కాదని తాను ఆశిస్తున్నానని వెంకట్ రెడ్డి చెప్పారు. ఆశించిన వృద్ధిని సాధించడానికి అభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి పొరుగు, ఇతర దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో కలిసి పని చేయాలన్నారు.  వచ్చే ఏడాది భారత అధ్యక్షునిగా జి20 నిర్వహించనున్న 190 సమావేశాలలో కొన్ని సమావేశాలను హైదరాబాద్ వంటి నగరంలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ను కోమటి రెడ్డి కోరారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News