తొలిరోజు ఉభయసభలను
ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
27 వరకు సాగనున్న సభలు నోటిఫికేషన్ జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: తొలి రోజు ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు శుక్రవారం నోటికేషన్ జారీ చేశారు. ఇదిలావుండగా గురువారం రాత్రి జరిగిన మంత్రి వర్గ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఈ నెల 12 నుంచి 27 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమై 13న సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఆ మరుసటి రోజు 14న హోలీ పండుగ సెలవు దినం కావడంతో ఈ నెల 15 శనివారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయా, లేక శని, ఆదివారాలు సెలవు దినాలు మినహాయించి సోమవారం 17 నుంచి నిరవధికంగా జరుగుతాయా అనేడి తెలియాల్సి ఉంది.