Sunday, January 19, 2025

ఈ నెలలో బుధాదిత్య యోగం !

- Advertisement -
- Advertisement -

4 రాశుల వారికి అదృష్టం స్వంతం

హైదరాబాద్: నవగ్రహాలలో కొన్ని గ్రహాలు ఏప్రిల్ నెలలో తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. నవగ్రహాలకు అధిపతి అయిన ఆదిత్యుడు ప్రతి నెల తన రాశిని మార్చుకుంటుంటాడు. ఏప్రిల్ నెలలో సూర్యుడు మేష రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. అయితే మేషరాశిలో ఇప్పటికే బుధుడు ఉన్నాడు. మేష రాశిలో బుధుడు, ఆదిత్యుడు కలువబోతున్నారు. దీంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతున్నది. ఈ యోగం కొన్ని రాశుల వారికి శుభాలను కలుగచేయనున్నది. ఆ అదృష్ట రాశులు: మేషరాశి, కర్కాటక రాశి, సింహ రాశి, మీన రాశి.

మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఏప్రిల్ నెలలో అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. తమ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షిస్తారు.

కర్కాటక రాశి:  ఈ రాశి వారికి సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగస్థులు మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడుల వల్ల లాభాలు, వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్థులకు శుభవార్త ఉంటుంది. రుణాలు తీరుతాయి. ఆర్థిక లాభాలు సిద్ధిస్తాయి.

సింహ రాశి: ఈ రాశి వారికి అదృష్టం వరించనున్నది. ఏ ప్రజెక్ట్ చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు సిద్ధిస్థాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. పొదుపు చేస్తారు.

మీన రాశి: బుధాదిత్య యోగం వల్ల ఈ రాశి వారు కూడా శుభ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయాణం ఫలిస్తుంది. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండనున్నది. ఉద్యోగులు, వ్యాపారులు లాభాలు అందుకుంటారు. కెరీర్ లో సమస్యలు తొలగి సంతోషంగా ఉంటారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News