Saturday, November 16, 2024

బుద్వేల్ భూమ్..ధామ్

- Advertisement -
- Advertisement -

హెచ్‌ఎండిఏ ఇ-వేలానికి భారీ స్పందన వచ్చింది. గతంలో కోకాపేట్ నియోపాలిస్ లే ఔట్‌తో పాటు మోకిల లే ఔట్‌లోని ప్లాట్లను కొనుగోలు చేయడానికి ప్రముఖ సంస్థలు పోటీపడగా ప్ర స్తుతం బుద్వేల్ భూములను కొనుగోలు చేయడానికి రియల్ సంస్థలు ఆసక్తి చూపాయి. బుద్వేల్ ఇవేలంలో ప్రభుత్వానికి భారీ మొత్తం లో ఆదాయం సమకూరింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని బుద్వేల్ భూములకు హెచ్‌ఎండిఏ గురువారం వేలం నిర్వహించగా 100 ఎ కరాలకు రూ.3,625.73 కోట్ల ఆదాయం స మకూరింది. వారం క్రితం కోకాపేట్ నియోపాలిస్‌లోని లే ఔట్‌లో 45.33 ఎకరాలకు గాను రూ.3319.60 కోట్లు రాగా ప్రస్తుతం బుద్వేల్ లే ఔట్ ద్వారా రూ.300 కోట్ల ఆదాయం అధికంగా వచ్చింది. బుద్వేల్‌లో ఉదయం తొలి సె షన్‌లో భాగంగా ఇవేలాన్ని అధికారులు నిర్వహించారు. ఈ వేలంలో 58.19 ఎకరాల భూ మికి రూ.2,061 కోట్ల ఆదాయం వచ్చింది.

అత్యధికంగా ప్లాట్ నంబర్ 4లో ఎకరా ధర రూ.39.25 కోట్లు పలకగా అత్యల్పంగా ఎకరా ధర రూ.33.25 కోట్లు ధర పలికింది. ఉద యం జరిగిన తొలి 1, 2, 4, 5, 8, 9, 10 ప్లాట్లకు ఇవేలాన్ని అధికారులు నిర్వహించారు. తొలిసెషన్‌లో 58.19 ఎకరాలకు గాను ఈ-వేలం ప్లాట్‌ల వారీగా జరిగింది. ప్లా ట్ నెంబర్ 1 ఎకరం ధర రూ.34.50 కోట్లు, ప్లాట్ 2 ఎకరం ధర రూ.33.25 కోట్లు, ప్లాట్ 5 నెంబర్ ఎకరం ధర రూ.33.25 కోట్లు, ప్లాట్ 8 నెంబర్ ఎకరం ధర రూ.35.50 కోట్లు, ప్లాట్ 9కి ఎకరం ధర రూ.33.75 కోట్లు, ప్లాట్ 10 నెంబర్‌కు ఎకరం ధర రూ.35.50 కోట్లు పలికాయి. గురువారం మొత్తం 100 ఎకరాలకు ఈ-వేలం హెచ్‌ఎండిఏ నిర్వహించింది. అందులో 58.19 ఎకరాలు ఉదయం తొలి సెషన్‌లో వే లం నిర్వహించింది. మిగిలిన 41.81 ఎకరాలకు సెకండ్ సెషన్ వేలాన్ని హెచ్‌ఎండిఎ నిర్వహించగా రూ.1,564.73 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా బుద్వేల్‌లోని 100 ఎకరాలు (14 ప్లాట్లకు గాను) రూ.3,625.73 కోట్ల ఆదాయం హెచ్‌ఎండిఏకు వచ్చింది.

బుద్వేల్‌లో గరిష్ట ధర రూ.41.75 కోట్లు
గతంలో హైదరాబాద్, రంగారెడ్డిలో నిర్వహించిన హెచ్‌ఎండిఎ ఇ-వేలంలో భూములు రికార్డు ధరను పలికాయి. కోకాపేట భూములైతే గత రికార్డులను చేరిపేశాయి. 45.33 ఎకరాల నియో పొలిస్ భూములకు వేలంలో ఏకంగా ఎకరా భూమి రూ.100.75 కోట్ల ధర పలికింది. అత్యల్పంగా ఎకరం భూమి రూ.67.25 కోట్లు పలికింది. గురువారం బుద్వేల్‌లో జరిగిన వేలంలో ఎకరానికి గరిష్ట ధర రూ. 41.75 కోట్లు పలకగా, కనిష్ట ధర రూ.33.25 కోట్ల ధర పలికింది. మొత్తం గా ఈ బుద్వేల్ వేలంలో భూముల ధర ఎకరానికి (యావరేజ్‌గా) రూ.36.25 కోట్ల ధర పలికిందని హెచ్‌ఎండిఏ తెలిపింది. ఈ భూముల కోసం స్థిరాస్తి సంస్థలు నువ్వా,నేనా అన్నట్లు పోటాపోటీ పడడం విశేషం.

ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) రాజేంద్రనగర్ సమీపంలో బుద్వేల్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) దాదాపు 182 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న బుద్వే ల్ లే ఔట్ ప్లాట్ల అమ్మకంలో భాగంగా గురువారం ఈ వేలాన్ని నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన ఫస్ట్ సెషన్ వేలంలో ప్లాట్ నెం. 1,2,4,5,8,9,10 లకు బిడ్డర్, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటాపోటీగా బిడ్‌లను సమర్పించాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి వేలం జోరందుకుంది. ఈ 100 ఎకరాల్లో ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు కాగా, గరిష్ఠంగా 14.3 ఎకరాలుగా అధికారులు విభజించారు. ఒక్కో ఎకరానికి మినిమమ్ అప్‌సెట్ రేటును రూ.20 కోట్లుగా అధికారులు నిర్ణయించి ఈ వేలాన్ని నిర్వహించారు.
12వ నెంబర్ ప్లాట్‌కు రూ.40.25 కోట్లు
రెండో సెషన్‌లో 11 నుంచి 17 ప్లాట్లకు వేలాన్ని అధికారులు నిర్వహించారు. 11వ నెంబర్ ప్లాట్ సైజు (6.92 ఎకరాలు) ఇది ఎకరం రూ.34 కోట్లు పలికింది. 12వ నెంబర్ ప్లాట్ సైజు 6.69 ఎకరాలు కాగా, ఇది ఎకరం రూ.40.25 కోట్లు పలికింది. 13వ నెంబర్ ప్లాట్ సైజు (6.94 ఎకరాలు) కాగా, ఎకరం రూ.40.25 కోట్లు, 14వ నెంబర్ ప్లాట్ సైజు 6.33 ఎకరాలు కాగా ఎకరం ధర రూ.33.75 కోట్లు పలికింది.
మోకిలలో కూడా భారీ ఆదాయం
హైదరాబాద్ నగర శివారులో ఉన్న మోకిలలో 165 ఎకరాల్లో హెచ్‌ఎండిఏ లే ఔట్‌లో తొలి విడత 15,800 చదరపు గజాల్లోని 50 ప్లాట్లను రూ.121.40 కోట్లకు విక్రయించింది. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. రెండో విడతలో 50 నుంచి 100 ప్లాట్లను ఈ-వేలం వేయడానికి హెచ్‌ఎండిఏ సిద్ధమవుతుంది. దీంతోపాటు షాబాద్‌లోని ప్లాట్లను కూడా హెచ్‌ఎండిఏ విక్రయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News