Monday, December 23, 2024

విద్యుత్‌షాక్‌తో పాడి గేదె మృతి

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్‌: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్ కిషన్‌నాయక్‌తండాలో బుధవారం రాత్రి విద్యుత్‌షాక్‌తో పాడి గేదె మృతిచెందింది. వివరాల ప్రకారం తండాకు చెందిన బుజ్జిబాయి తన గేదెను రోజువారిలాగానే పొలంలో మేపుతుండగా పక్కనే ఉన్న మినీ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు మేసుకుంటూ వెళ్లి విద్యుత్‌షాక్ తగిలి గేదె అక్కడికక్కడే మృతిచెందిందని బాధితురాలు తెలిపింది. పాడి గేదె విలువ సుమారు రూ.70వేలు ఉంటుందన్నారు. స్థానిక సర్పంచ్ సంధ్యనాయక్, నియోజకవర్గ కురుమ సంఘం ఉపాధ్యక్షులు మల్‌గొండలు బాధితురాలును పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News