Friday, December 20, 2024

అధికారుల నిర్లక్ష్యం: విద్యుత్ షాక్ తో పాడిగేదెలు మృతి

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్ ః విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో మూడు పాడిగేదెలు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ మండలం చౌదరిగూడ పరిధిలోని ఎంఎల్‌ఆర్ కాలనీ సమీపంలోని వ్యవసాయ పొలం శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు పోచారం సామల వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఎంఎల్‌ఆర్ కాలనీ సమీపంలోని వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభం నేల కూలడంతో మేతకు వెళ్లిన మూడు పాడిగేదెలు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు.

విద్యుత్ స్తంభం కూలిన విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫర నిలిపి వేయక పోవడంతోనే ఈ ఘోరం జరిగిందని భాదితులు వాపోయారు. ఒక్కో పాడిగేద దాదాపు లక్ష 20 వేల వరకు ఉంటుందని, మొత్త మూడు గేదెలు 3లక్షల 60వేల విలువ ఉంటుందని తెలిపారు. విధ్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం జరిగిందని బాధితుడు వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News