Thursday, January 23, 2025

టిటిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా బుగిడి అనూప్

- Advertisement -
- Advertisement -

కార్యనిర్వాహక కార్యదర్శులుగా సురేంద్ సింగ్, నంబూరి సూర్యం, కుర్ర ధనలక్ష్మి
రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా హబీబ్ మొహమ్మద్ నియామకం

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించారు. రాష్ట్ర కమిటీలో మరో ఐదుగురికి టిటిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చోటు కల్పించారు. రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడిని నియమించారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా కార్వాన్ నియోజకవర్గానికి చెందిన బుగిడి అనూప్‌ను నియమించారు. రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శులుగా కార్వాన్ నియోజకవర్గానికి చెందిన ఏ.సురేందర్సింగ్, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కుర్ర ధనలక్ష్మి, కోదాడ నియోజకవర్గానికి చెందిన నంబూరి సూర్యం నియమితులయ్యారు. కాగా, టిటిడిపి రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా చార్మినార్ నియోజకవర్గానికి చెందిన హబీబ్ మొహమ్మద్‌ను నియ్మించారు. ఈ మేరకు మంగళవారం కాసాని జ్ఞానేశ్వర్ నియామక ఉత్తర్వులు జారీచేశారు.

నూతనంగా పదవులకు ఎంపికైన అనూప్, సురేందర్ సింగ్, హబీబ్ మొహమ్మద్ తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను అందుకున్నారు. ఈ సంద్భ్రంగా వీరు కాసానిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టిడిపి జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి వెంకటేష్, బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీష్, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్, రాష్ట్ర మీడియా కో- ఆర్డినేటర్ బియ్యని సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News